- District News
- Khammam
- రైతు ప్రయోజనమే ధ్యేయంగా ఫారం పాండ్ పనులకు శ్రీకారం...
రైతు ప్రయోజనమే ధ్యేయంగా ఫారం పాండ్ పనులకు శ్రీకారం...
సర్పంచ్ మోతి వీరస్వామి
కారేపల్లి : లోకల్ గైడ్ న్యూస్, ఆగష్టు 31 :
మండలంలోని రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో రైతు సంక్షేమానికి మరో ముందడుగు పడింది. రైతు వెన్నెబోయిన నాగేశ్వరరావు వ్యవసాయ భూమి వద్ద ఫారం పాండ్ పనులను గ్రామ సర్పంచ్ వీసం మోతీ వీరస్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు.
వర్షపు నీటిని నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో వ్యవసాయానికి వినియోగించుకునేందుకు ఫారం పాండ్‌లు ఎంతో ఉపయోగపడతాయని సర్పంచ్ మోతీ వీరస్వామి తెలిపారు. రైతుల అవసరాలను గుర్తించి వారికి ప్రయోజనం చేకూరే అభివృద్ధి పనులకు గ్రామపంచాయతీ తరఫున ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో మౌలిక వసతులతో పాటు రైతులకు ఉపయోగపడే పనులను కూడా చేపడుతూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో సర్పంచ్ మోతీ వీరస్వామి చొరవను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా గ్రామ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
*ఎమ్మెల్యే అభివృద్ధి దృక్పథానికి అనుగుణంగా..*
వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారని నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే అభివృద్ధి దృక్పథానికి అనుగుణంగా గ్రామస్థాయిలో కూడా ప్రజలకు, రైతులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రేగులగూడెం గ్రామపంచాయతీలో సర్పంచ్ మోతీ వీరస్వామి నాయకత్వంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవుల సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి వీసం రవికుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈసం భద్రంతో పాటు గ్రామ పెద్దలు పిట్టల వెంకటేశ్వర్లు, రెడ్డబోయిన చిన్న వెంకటేశ్వర్లు, అడపా వెంకటేశ్వర్లు, పిట్టల మధు, పోలెబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.
