మాదారం గ్రామం లో ఉచిత వైద్య శిబిరం

జనరేషన్ ఫర్ క్రైస్ట్ చర్చ్ పాస్టర్ రాజు ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

ప్రజలందరూ హెల్త్ క్యాంపు ని సద్వినియోగం చేసుకోవాలి గ్రామ సర్పంచ్.ఎం లావణ్య ప్రభు
Published On
మాదారం గ్రామం లో ఉచిత వైద్య శిబిరం

 

 

 

 లోకల్ గైడ్,వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

నవాబుపేట్ మండలం 
మండల పరిధిలోని మాదారం గ్రామంలో పాస్టర్ రాజు ఆధ్వర్యంలో మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ జనరల్ హాస్పిటల్ ఉచిత మెగా మెడికల్ క్యాంపును గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని తమ అనారోగ్య పరిస్థితులను డాక్టర్లచే చూపించుకోవాలని పాస్టర్ రాజు తెలిపారు. జనరేషన్ ఫర్ క్రైస్ట్ చర్చి దగ్గర నిర్వహించిన హెల్త్ క్యాంపును సుమారు 100 నుంచి 150 మంది గ్రామ ప్రజలు చూయించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మహావీర్ ఆస్పటల్ వైద్య బృందం మెడికల్ క్యాంపు నిర్వహించి గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లావణ్య ప్రభు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఈ హెల్త్ క్యాంపు ను సద్వినియోగం చేసుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు అవసరమైన వైద్య సలహాలు మందులు తీసుకొని ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు మహావీర్ హెల్త్ క్యాంపులో గ్రామ ప్రజలకు గర్భిణీ స్త్రీలకు గైనకాలజిస్ట్ ఆర్థోపెటిక్ ఈఎన్టి చర్మవ్యాధులకు కార్డియాలజీ జనరల్ సర్జన్ రేడియాలజీ పలు అనారోగ్య పరిస్థితులకు మహావీర్ హాస్పటల్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని అదేవిధంగా మహావీర్ ఆస్పటల్ ఉచిత నార్మల్ డెలివరీ సిజరిన్  కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఆరోగ్యశ్రీ సేవలు క్యాన్సర్ గడ్డలకు చికిత్స యూరాలజీ కిడ్నీ రౌతుల ఆపరేషన్ 24 గంటలు సేవలో ఉండి వెంటనే ఐసీయూ సదుపాయం పాముకాటు తేలుకాటు విషం తాగినవారికి ప్రత్యేకంగా వైద్యం అందించడం ప్రతిరోజు గుండె స్కానింగ్ సదుపాయం కూడా మహావీర్  హాస్పటల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.

 వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన మా గ్రామ పాస్టర్ రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు అని  గ్రామ సర్పంచ్ తెలిపారు ఈ కార్యక్రమంలో....గ్రామ ఉపసర్పంచ్. రాములమ్మ అనంతయ్య, మాజీ సర్పంచ్ అంజయ్య, వెంకట్ మహావీర్ సూపర్వైజర్ రమేష్ డాక్టర్ శ్రీకాంత్ ఆర్తో డాక్టర్ వినయ్, జాహ్నవి నాగ సాయి శరత్, మహావీర్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి.
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తాతా మధు దూషించడం సరికాదని ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్...
దళితులంటే బిఆర్ఎస్ పార్టీకి అంత చిన్న చూపా*? దళితుల జోలికి వస్తే ఖబడ్దార్ : ,
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి.
పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సట్టు సైదులు.
జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి 
గణేష్ ఉత్సవాల్లో డిజే లకు అనుమతి లేదు.        
ఫిరంగినాలపై అక్రమ నిర్మా ణాలు.......