భద్రాచలంలో 18, 19 తేదీల్లో ఎస్‌జీఎఫ్‌ మండల స్థాయి క్రీడా పోటీలు

మండల విద్యాశాఖ అధికారి  బెక్కంటి శ్రీనివాసరావు

Published On
భద్రాచలంలో 18, 19 తేదీల్లో ఎస్‌జీఎఫ్‌ మండల స్థాయి క్రీడా పోటీలు

 

 

భద్రాచలం, లోకల్ గైడ్ న్యూస్ (భద్రాద్రి జిల్లా బ్యూరో) :

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో 70వ మండల స్థాయి క్రీడా పోటీలను ఈ నెల 18, 19 తేదీల్లో భద్రాచలంలో నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు తెలిపారు. 18వ తేదీన బాలికలకు, 19వ తేదీన బాలురకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మండల వనరుల కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, శారీరక విద్య ఉపాధ్యాయులు, ఫిజికల్‌ డైరెక్టర్లతో ఎంఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. క్రీడా పోటీల నిర్వహణకు ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు కన్వీనర్‌గా, పీవీ రమణ, ఎస్‌ఎన్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్‌ భద్రాచలం పీడీగా, ఎం. రమేష్‌, పి. సుజాత కో-కన్వీనర్లుగా, రాజా శ్రీనివాస్‌ కమిటీల సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. మండలంలోని పాఠశాలల శారీరక విద్య ఉపాధ్యాయులు, ఫిజికల్‌ డైరెక్టర్లు కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్‌ పాఠశాలల అసోసియేషన్‌ ప్రతినిధులు, సీఆర్‌పీలు, సీసీహెచ్‌ఓలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్.  తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్. 
    రాజేంద్ర నగర్ (లోకల్ గైడ్ ): అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో బి ఆర్ ఎస్ వర్కింగ్
ఖమ్మం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు ఆట వస్తువుల సరఫరాకు షార్ట్ టెండర్ ఆహ్వానం…
భాగ్యనగర్ తండా రైల్వే సమస్యపై ఎస్టీ కమిషన్‌కు వినతి
దళిత రైతుల ఆగ్రహం ఉవ్వెత్తున.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి – లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
_కొలన్ హనుమంత రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరైన నాయకులు
పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం.
దళితులను అవమానించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి...