- District News
- ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు.
ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశానుసారం పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ యువజన కాంగ్రెస్ సభ్యులందరికీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మాట్లాడుతు భారతదేశానికి యువతే అతిపెద్ద బలం అని,యువ భారతీయులకు ఒక వేదికను కల్పించి,వారి గొంతుకను బలోపేతం చేస్తు వారి సమస్యలను లేవనెత్తుతు,వారి హక్కులు,కలలు ఆశయాల కోసం పోరాడుతు వచ్చిన ఘనమైన చరిత్ర ఉందన్నారు.విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ మోదీ ప్రభుత్వ వ్యవస్థతో నేడు మన యువత పోరాడుతున్న తరుణంలో అడుగడుగునా అండగా నిలుస్తోందన్నారు.రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.ప్రజా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,యువజన కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని సూచించారు.అదేవిధంగా 2029లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో బెల్లంపల్లి నుండి బెల్లంపల్లి ఎమ్మెల్యే ను 2వసారి భారీ మెజార్టీతో గెలిపించేందుకు నేటి యువకులు సైనికుల్లాగా కష్టపడి రేపటి మన భవిష్యత్తు కోసం కష్టపడాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి సోషల్ మీడియా మంచిర్యాల జిల్లా కన్వీనర్ దేవసాని ఆనంద్,జిల్లా అధ్యక్షుడు ఆదర్శ వర్ధన్,జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎల్పుల రోహిత్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బట్టు శ్రీనివాస్,తాండూరు మండల అధ్యక్షుడు విష్ణు కళ్యాణ్,కన్నెపల్లి మండల అధ్యక్షుడు సాయి కుమార్,పట్టణ ఉపాధ్యక్షుడు ఇమ్ము,ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి యూనిస్,నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చిలుముల సాయి కుమార్,యూత్ కాంగ్రెస్ మాజీ పట్టణ అధ్యక్షులు ఎలుక ఆకాష్,నాయకులు ఖలీల్,వెంకట్ యాదవ్,ప్రదీప్,నవీన్,హాసిఫ్,హరీష్,శ్రావణ్,వికాస్,భరత్,గద్దెల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
