- District News
- Khammam
- మిషన్ వాక్ క్యాంప్‌కు పువ్వాడ అజయ్‌కు ఆహ్వానం
మిషన్ వాక్ క్యాంప్‌కు పువ్వాడ అజయ్‌కు ఆహ్వానం
నవంబర్ 1న వైరాలో భారీ ప్రత్యేక వైద్య శిబిరం.. ఆహ్వాన పత్రం అందజేసిన డాక్టర్ రవి బాదావత్
కారేపల్లి , అక్టోబర్ 8 (లోకల్ గైడ్ న్యూస్):
బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, వికలాంగత్వం, నడక, కదలిక సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించేందుకు నవంబర్ 1న వైరాలో మిషన్ వాక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ప్రత్యేక వైద్య శిబిరానికి తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పువ్వాడ అజయ్ కుమార్‌ను మిషన్ వాక్ ఫౌండర్ డాక్టర్ రవి బాదావత్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా శిబిరానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని పువ్వాడ అజయ్ కుమార్‌కు అందజేశారు. బాధితులకు అవసరమైన వైద్య సలహాలు, పునరావాసానికి సంబంధించిన మార్గదర్శకత్వం, నడక–కదలిక సమస్యలపై నిపుణుల సూచనలు అందించడమే శిబిరం ప్రధాన ఉద్దేశమని డాక్టర్ రవి బాదావత్ తెలిపారు. వైద్య సహాయం అవసరమైన వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిషన్ వాక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. వైద్య సహాయం అవసరమైన వారికి ఇలాంటి శిబిరాలు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు వల్లభనేని రామారావు, రోటరీ ట్రస్ట్ చైర్మన్ వాసుదేవ్, రోటరీ క్లబ్ కార్యదర్శి సాంబశివరావు, ప్రసాద్, షేర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 1న వైరాలో నిర్వహించనున్న మిషన్ వాక్ క్యాంప్‌కు బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, వికలాంగత్వం, నడక, కదలిక సమస్యలతో బాధపడుతున్న వారు హాజరై అందుబాటులో ఉన్న వైద్య సేవలు, నిపుణుల సూచనలు పొందాలని నిర్వాహకులు కోరారు.
