- District News
- Ranga Reddy
- బహదూర్‌గూడ, సరూర్‌నగర్‌లో అదనపు కలెక్టర్
బహదూర్‌గూడ, సరూర్‌నగర్‌లో అదనపు కలెక్టర్
స్థానిక సంస్థలు) డాక్టర్ కె.కిరణ్మయి క్షేత్రస్థాయి తనిఖీలు.
(
రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ): బహదూర్‌గూడ, సరూర్‌నగర్ ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థలను సందర్శించి, అక్కడ కొనసాగుతున్న సేవలు, విద్యా కార్యక్రమాలు, వైద్య సేవలను రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కీరణ్మయి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎం పి పి ఎస్ బహదూర్‌గూడ, అంగన్‌వాడీ కేంద్రం, ప్రీ-ప్రైమరీ పాఠశాల, బహదూర్‌గూడ, యూ పి హెచ్ సి సరూర్‌నగర్, జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం (డి డి ఆర్ సి ) సరూర్‌నగర్లను సందర్శించారు.
జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రంలో విద్యార్థులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న శిక్షణ, నిర్వహిస్తున్న తరగతులు అందుబాటులో ఉన్న పునరావాస సేవలను సమీక్షించారు. విద్యార్థుల అవసరాలు, కేంద్రం పనితీరు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించి దివ్యాంగులకు నాణ్యమైన సేవలు సమర్థవంతంగా అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
