- District News
- Nalgonda
- పదవీ విరమణ పొందిన హోంగార్డుకు ఘన సన్మానం.
పదవీ విరమణ పొందిన హోంగార్డుకు ఘన సన్మానం.
నల్గొండ జిల్లా పోలీస్ శాఖ హోమ్ గార్డ్స్ విభాగంలో 19 సంవత్సరాల పాటు అంకితభావంతో, క్రమశిక్షణతో సేవలందించి, దేవరకొండ సబ్‌జైలులో విధులు నిర్వహిస్తూ నేడు పదవీ విరమణ పొందిన హోమ్ గార్డ్ పోలుదాసు మహాలక్ష్మిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో 19 సంవత్సరాల పాటు అంకితభావంతో, క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేస్తున్న పోలుదాసు మహాలక్ష్మికి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో ఆమె కనబరిచిన క్రమశిక్షణ, అంకితభావం, సేవా నిబద్ధత అభినందనీయమని పేర్కొన్నారు.హోమ్ గార్డ్‌గా విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు అందించిన సేవలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. శాఖ తరఫున ఆమెకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ. కళ్యాణ్ రాజ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
