వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్దలతో.  నిర్వహించుకోవాలి

భానూరు 8వ వార్డు సభ్యులు కుమ్మరి ప్రవళిక నరేందర్.      

Published On
వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్దలతో.  నిర్వహించుకోవాలి

    రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ( లోకల్ గైడ్ ):

వినాయక చవితి ఉత్సవాలను ప్రతి ఒక్కరు భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని భానూరు 8వ వార్డు సభ్యులు కుమ్మరి ప్రవళిక నరేందర్ తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భానూర్ గ్రామంలో గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు భానూర్, పటాన్చెరు, క్యాసారం, ఇస్నాపూర్, కంచర్లగూడెం, భానూర్ తదితర గ్రామాల యువత, వినాయక ఉత్సవాల నిర్వాహకులకు సుమారు 3 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్దలతో, సోదరా భావంతో గ్రామంలో  వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ, యువతలో ఐక్యత, సోదరభావం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు.అలాగే అచ్చని శివకుమార్,  భానూరు  8వ వార్డు సభ్యురాలు  కుమ్మరి ప్రవళిక నరేందర్ ఆధ్వర్యంలో 200 ఉచిత మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేశారు. మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. అదే విధంగా శాంతి యూత వాతావరణంలో ఈ వినాయక ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.

Tags:

About The Author

Latest News