యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి

సత్యనారాయణ గౌడ్ , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు 

Published On
యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి

 
ఖమ్మం, ఆగస్టు9: లోకల్ గైడ్:

యువజన పార్టీ ఆవిర్భావ దినోత్సవమును పురస్కరించుకొని జెండాను ఆవిష్కరించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ 
మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి.

యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం లో కార్యకర్తలకు ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్  పిలుపు

ఖమ్మం: యువత శక్తిని జాతీయ నిర్మాణానికి వినియోగించడంతో పాటు, నిరుద్యోగం, విద్య, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, యువత హక్కులపై అవగాహన కల్పించడం, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు నిర్వహించడమే యువజన కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్ అన్నారు.

యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేజండ్ల సాయికుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు మరియు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు  
గార్లు ముఖ్య అతిథిలుగా హాజరైనారు

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు,ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదని, ప్రశ్నించడం, నిరసించడం, న్యాయం కోరడం యువత ప్రజాస్వామ్య హక్కులని అన్నారు. దేశంలోని యువత గొంతుకను అణచివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. హింస, బెదిరింపులు, అణచివేత ద్వారా యువత హక్కులను కాలరాయడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై తగిన దృష్టి పెట్టడం లేదని సాయికుమార్ విమర్శించారు. నిరుద్యోగం నిర్మూలన, విద్యా రంగం అభివృద్ధి, సామాజిక న్యాయం, యువత హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువజన కాంగ్రెస్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
“బీజేపీ ముసుగులో ఉన్న RSS భావజాలానికి ఈ దేశ యువత భయపడదు. యువత నిరంతరం ప్రశ్నిస్తుంది. యువతను భయపెట్టలేరు, అణచలేరు, ఆపలేరు” అని అన్నారు. యువత సమస్యలపై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయ సమీపంలో దాదాపు 300 మంది ప్రజలకు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కిసాన్ సేల్ ఉప అధ్యక్షులు బాలాజీ నాయక్  జిల్లా అనుబంధ సంఘాల  అధ్యక్షులు  కొత్త సీతారాములు, శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం, జిల్లా జనరల్ సెక్రెటరీ లు కిలారు అనిల్ కుమార్, గంగరాజు, బచ్చలకూర నాగరాజు,గాదెల  ఝాన్సీ, బామ్మిడి శ్రీనివాస్, రంగా జనార్ధన్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు షాహెల జావిద్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర సెక్రెటరీ అంజన్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు బెజ్జం బాలగంగాధర్,బానోత్ కోటేష్,  జిల్లా జనరల్ సెక్రెటరీ లు బెల్లంకొండ శరత్, కుక్కల మహేష్, అన్వేష్ గౌడ్, నెల్లూరి ఉపేందర్, బాలరాజ్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ బెల్లం సాయి తేజ  మరియు నియోజకవర్గ ఉపాధ్యక్షులు అంబటి ఈశ్వర్, జంగం రాజేష్, నితీష్ కుమార్, కైసర్, ఆకాష్ నాయుడు, సాయి తేజ  ఖమ్మం టౌన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, టౌన్ ఉపాధ్యక్షులు సైదన్ రావు,సంపత్ నాయుడు మండల అధ్యక్షులు రామకృష్ణ, నిమ్మల నాగేశ్వరావు, సతీష్, ముత్తారావు, మరియు యువజన కాంగ్రెస్ నాయకులు బోడిపూడి రాజా,పంది రాజు,దేవరకొండ రాజీవ్ గాంధీ, సాయి కుమార్, తోట నరేష్ గార్లు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు