బోర్‌వెల్‌కు రీఛార్జ్.. భూగర్భ జలాలకు బూస్ట్!

భాగ్యనగర్ తండాలో పనులను పరిశీలించిన ఎంపీడీఓ పద్మ

Published On
బోర్‌వెల్‌కు రీఛార్జ్.. భూగర్భ జలాలకు బూస్ట్!

 

 

సింగరేణి, అక్టోబర్ 1 (లోకల్ గైడ్ న్యూస్):

సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా చేపడుతున్న బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణ పనులను ఎంపీడీఓ పద్మ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మ మాట్లాడుతూ బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాల ద్వారా వర్షపు నీటిని భూగర్భంలోకి మళ్లించి భూగర్భ జలాలను పెంపొందించవచ్చన్నారు. తద్వారా భవిష్యత్‌లో నీటి నిల్వలు పెరిగి, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు దోహదపడుతుందని తెలిపారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేలా రీఛార్జ్ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్, ఈసీ సుధీర్, పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ రాంబాబు, వార్డు సభ్యుడు గాంధీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉమామహేశ్వరరావు, గ్రామస్తులు బాబు, పంచాయతీ సిబ్బంది రాందాస్, గణేష్, నంద, రాధా, హేంచంద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గోవిందుతండాలో గాయత్రి దేవికి భక్తి కానుక.. 10 చీరల విరాళం! గోవిందుతండాలో గాయత్రి దేవికి భక్తి కానుక.. 10 చీరల విరాళం!
        కారేపల్లి, అక్టోబర్ 12 (లోకల్ గైడ్ న్యూస్): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిపై భక్తిని చాటుకుంటూ గోవిందుతండాకు చెందిన బానోత్ లచ్చిరామ్–బుజ్జి దంపతులు, వారి
హకీంపేట్ బాధితుడిని మిషన్ హాస్పిటల్లో  పరామర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 
మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి వాక్‌ ఇన్‌ అడ్మిషన్లు
ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు
గోవిందుతండాలో వైభవంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ
ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి, పాడిన మంత్రి సీతక్క