- District News
- Khammam
- జన్మదిన వేడుకల్లో సేవా బాట
జన్మదిన వేడుకల్లో సేవా బాట
పగడాల నాగరాజు జన్మదినం సందర్భంగా గాదెపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ
కారేపల్లి, సెప్టెంబర్ 29 (లోకల్ గైడ్ న్యూస్):
బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు జన్మదినాన్ని పురస్కరించుకుని గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగకరమైన సామగ్రిని పంపిణీ చేశారు. మద్దెబోయిన సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. విద్యార్థుల చదువుకు తోడ్పడేలా అవసరమైన సామగ్రిని అందించడం ద్వారా జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించారు. విద్యార్థులు విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భూక్యా ధనలక్ష్మి, కోటేశ్వరరావు, ఉన్నం ఉమారాణి, కెళ్లోత్ సూర్యకుమార్, నన్నెబోయిన వెంకటేశ్వర్లు, మేకల చిన్న నారాయణ, శేఖర్, ఉపేందర్, సురేష్, షకీల్, జంపయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
