దోమల దండయాత్రతో భాగ్యనగర్‌ తండా ప్రజల అవస్థలు

పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్థుల డిమాండ్‌ – ఫాగింగ్‌ చేయాలని విజ్ఞప్తి

Published On
దోమల దండయాత్రతో భాగ్యనగర్‌ తండా ప్రజల అవస్థలు

ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 22 (లోకల్ గైడ్ ) : భాగ్యనగర్

గ్రామపంచాయతీ పరిధిలో దోమల బెడద రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నా పాలకవర్గం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఇప్పటి వరకు సరైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టలేదని వారు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని డ్రైనేజీలు, మురుగునీటి నిల్వలు, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు విపరీతంగా పెరిగాయని గ్రామస్థులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో దోమల తీవ్రత అధికంగా ఉండటంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ పాలకవర్గం వెంటనే స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. దోమల నివారణ కోసం ప్రత్యేకంగా ఫాగింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భాగ్యనగర్‌ తండాలో పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags:

About The Author

Latest News