ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ

ఇద్దరికి గాయాలు.. ఖమ్మం ఆసుపత్రికి తరలింపు

Published On
ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ

 

ఖమ్మం జిల్లా , కారేపల్లి , ఆగష్టు 22 (లోకల్ గైడ్ ) :

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటన శనివారం సింగరేణి మండల పరిధిలోని మధురానగర్ గ్రామం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందుకు చెందిన ఖాదర్ అలీ ద్విచక్ర వాహనంపై కారేపల్లి మీదుగా ఖమ్మం వైపు వెళ్తుండగా, ముచ్చర్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ రాంబాబు పనిమీద కారేపల్లి వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో మధురానగర్ గ్రామం వద్ద ఇరువురి ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఖాదర్ అలీ, రాంబాబు ఇద్దరూ గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. గాయపడిన రాంబాబు ముచ్చర్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కాగా, ఖాదర్ అలీ ఇల్లందుకు చెందినవారు. ఆయన గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్‌గా పనిచేసినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

About The Author

Latest News