- District News
- Khammam
- విమలక్క 50 ఏళ్ల ప్రజా సంస్కృతిక ఉద్యమం
విమలక్క 50 ఏళ్ల ప్రజా సంస్కృతిక ఉద్యమం
50 గంటల పాటు ఆట.. పాట.. మాటల ప్రస్థానం
ఖమ్మం ఆగస్టు 10 : లోకల్ గైడ్:
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. విప్లవోద్యమాల నుండే విప్లవకారులు పుడతారు. ప్రజా ఉద్యమాల నుండి ప్రజా కళాకారులు ఉద్భవిస్తారు. తన జీవితకాలం విప్లవ ప్రజా సంస్కృతిక ఉద్యమాలలో 50 ఏళ్ల మైలురాయిని అధిగమించిన తన ప్రస్థానంలో 50 గంటల పాటు ఏకధాటిగా ఆట,పాట, మాటలతో ప్రజాకళ జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బహుళ ప్రజా కళలు, జానపద కళారూపాలు , ప్రజా కళా జాతర, మనువాదంగా సంస్కృతి మూడత్వమై, సామ్రాజ్యవాద సంస్కృతి సాగుతున్న దాడికి ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణంలో భాగమై సంస్థలను, శక్తులను, వ్యక్తులందరినీ సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు.
విమలక్క ఒక వ్యక్తి కాదు అని, సామూహిక శక్తి అని 1974 ఆగస్టులో అరుణోదయ సంస్కృతిక సమైక్య ఉస్మానియాలో పురుడు పోసుకునేటప్పటికీ బాల గాయనిగా వెలుగులోకి వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసునని అన్నారు. అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించి ప్రజా ఉద్యమాలే ఆయుధంగా ఎంచుకొని అరుణోదయ సంస్కృతిక విప్లవంలో పాటల ప్రస్థానం ఒక మరుపురాని ఘట్టం అన్నారు. తన జీవితం ప్రజలకు అంకితంగా భావిస్తూ తన స్వభావం కలిగిన కార్యకర్తలను కళాకారులను ప్రేమ పూర్వకంగా 50 గంటల పాటు సాగే ప్రజా కల జాతర నిర్వహణలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విమలక్క పిలుపునిచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో అరుణోదయ సంస్కృతిక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు మల్సూర్, ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, వర్ష సామాజిక అధ్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్, టిపి జెఎసి జిల్లా కన్వీనర్ విజయ్, అరుణోదయ సంస్కృతిక సమైక్య సహకార దర్శి రాకేష్, ఉపాధ్యక్షులు అనిత తదితరులు పాల్గొన్నారు.
