గణేష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. 

Published On
గణేష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. 

 

IMG-20260901-WA0108                       పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆకలితీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ అన్నారు. మంగళవారం మైలార్దేవ్ పల్లి డివిజన్ గణేష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార  పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే  ప్రకాష్ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  విద్యార్థులకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించి, వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం విద్యార్థులతో కలసి ఆయన కూడా అల్పాహారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఉదయాన్నే ఆకలితో పాఠశాలకు రాకూడదని, వారంతా ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోని ఉత్సాహంగా చదువుకోవాలనే ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అందుకోసం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చదువుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్,       మాజీ కార్పొరేటర్ టి ప్రేమ్ దాస్ గౌడ్ డివిజన్ అధ్యక్షుడు ఎన్ ధనుంజయ టి ప్రేమ్ గౌడ్ సానం నర్సింగ్ సరికొండ వెంకటేష్ భాషా శ్రీనివాస్ వివేక్ గట్టయ్య అర్థం లక్ష్మయ్య సానం రాజు సన్నావుల భాయ్ బొల్లా వెంకటేష్ కాశి గారి యాదగిరి ఎల్లప్ప ఎన్ నరసింహ పున్న కృష్ణ ఏసు గోవింద్ సుందర్ జగదీష్ ఆంజనేయులు శేఖర్  పవన్ రాము ప్రశాంత్ విజయ్ రాజు పాఠశాల ఉపాధ్యాయులు, నాయకులు,  విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News