నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత

2026లో పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్ రౌండ్లను దాటి మెయిన్ డ్రాకు అర్హత సాధించారు.

Published On

 

కుత్బుల్లాపూర్ మార్చి 22 ( లోకల్ గైడ్ ప్రతినిధి)

జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మకమైన యోనెక్స్ సన్‌రైజ్ 48వ ఇండియన్ మాస్టర్స్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026లో పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్ రౌండ్లను దాటి మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫికేషన్ ఫైనల్‌లో తమిళనాడుకు చెందిన శివశంకర్ తో తలపడిన వేణు ముప్పాల, 57 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించారు. పురుషుల డబుల్స్ విభాగంలో వేణు ముప్పాల, తన భాగస్వామి జ్ఞాన ప్రసాద్ రెడ్డితో కలిసి అద్భుత విజయాన్ని నమోదు చేశారు. గత నాలుగేళ్లుగా నిరంతరం శ్రమిస్తున్న వేణు ముప్పాలక్వాలిఫికేషన్ ఫైనల్‌లో మహారాష్ట్రకు చెందిన టాప్ సీడ్ జోడీ సచిన్ భారతి - కౌశిక్ వర్తక్ పైన సంచలన విజయం సాధించారు. వేణు ముప్పాల ప్రస్తుతం జాతీయ స్థాయి క్రీడాకారుడిగానే కాకుండా, ఎందరో భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దుతున్న 'మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ' వ్యవస్థాపక చైర్మన్‌గా సేవలందిస్తున్నారు. ఒకే జాతీయ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్, డబుల్స్ రెండింటిలోనూ మెయిన్ డ్రాకు అర్హత సాధించారు.

Tags:

About The Author

Latest News

ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి
లోకల్ గైడ్ బెజ్జంకి జూన్ 22: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజా సమస్యలను పక్కనపెట్టి తన అనుచరుల పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఐ జిల్లా నాయకుడు...
నువా డైమండ్ ఆభరణాల కలెక్షన్ను ఆవిష్కరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కోకాపేటలో
నీట్ రీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు....
ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం కోసం అంగన్వాడీల కృషి అభినందనీయం -గుడిమల్కాపూర్ డైరెక్టర్ బండారి శంకర్
రవీంద్రభారతిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వి హెచ్ హనుమంతరావుకు ఘన సన్మానం 
8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ:
వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పని చేయాలి ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్