- District News
- Nizamabad
- ఎయిడ్స్ పై రెండు నెలల పాటు అవగాహన కార్యక్రమం
ఎయిడ్స్ పై రెండు నెలల పాటు అవగాహన కార్యక్రమం
Published On
By Ram Reddy
నిజామాబాదు జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్, ఆగష్టు 12:
అని అన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ గారి ఛాంబర్ లో ఎయిడ్స్ పై ఐఐఈసీ( తీవ్రతరమైన విజ్ఞాన సమాచారం- అవగాహన) కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ డాక్టర్ బి. రాజశ్రీ తో పాటు తమ ప్రమాదకర పరిస్థితిని తెలుసుకునే క్యూఆర్ కోడ్ పోస్టర్ ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రభుత్వ ఆదేశానుసారం హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో భాగంగా... ఈ విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమం రెండు నెలల పాటు కొనసాగుతుందని అన్నారు. అలాగే డి ఎం హెచ్ వో డా.రాజశ్రీ మాట్లాడుతూ ఈ కార్యక్రమము రెండు నెలల పాటు జిల్లాలో కొనసాగుతుందని అన్నారు. ఇందులో భాగంగా 200 కళాశాలల, పాఠశాలల విద్యార్థులకు , అలాగే ఎంపిక చేసిన 200 గ్రామాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమం పై జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. యువత అవగాహన కొరకు బైక్ ర్యాలీని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో డా. దేవి నాగేశ్వరి టిబి నియంత్రణ అధికారి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సికందర్ నాయక్ ,ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ వెంకన్న, డాక్టర్ సుప్రియ,హెల్త్ ఎడ్యుకేటర్ గన్ పూర్ వెంకటేష్ , డి పి ఎం సుధాకర్, సి పి వో మొహిజ్ అహమ్మద్ ,సి ఎస్ వో నవీన్, స్నేహ సొసైటీ సిద్దయ్య, డిపిఓ విశాల, హెచ్ఈఓ గోవర్ధన్, నాగరాజు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ,వివిధ స్వచ్ఛంద సంస్థలు స్నేహ సొసైటీ, వర్డు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వై ఆర్ జి నుండి సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
26 Aug 2026 08:52:15
ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగస్టు 25 ( లోకల్ గైడ్ ) :
కారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద వన మహోత్సవ
