- District News
- సిపిఐ జెండా ఆవిష్కరణ
సిపిఐ జెండా ఆవిష్కరణ
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కేంద్రంలో బస్టాండ్ దగ్గర సిపిఐ జెండావిష్కరణ నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. రాష్ట్ర కార్యదర్శువర్గ సభ్యురాలు పశ్య పద్మ ఆవిష్కరించడం జరిగింది అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ ఆగస్టు 9 నుండి 14 వరకు కామారెడ్డి జిల్లాలో పాదయాత్ర లు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ధరలను పెరుగుదలను తక్షణ అరికట్టాలని పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి లని ప్రతి యువకులకు ఉద్యోగాలు కల్పించాలని. మహిళా రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలని కార్మిక హక్కులను పరిరక్షించాలని. అదేవిధంగా నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్. పెరిగిన ధరలను తగ్గించాలని. రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎరువుల ధరలు తగ్గించాలని స్వామినాథ సిఫార్సులు అమలు చేయాలని ఆమె అన్నారు. ఈనెల 14 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచార పాదయాత్రల కు సిపిఐ పిలుపునిచ్చింది ఈ పాదయాత్ర లు 2026 సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలో రామ్ లీలా మైదానంలో జరగబోయే బహిరంగ సభ ర్యాలీ తో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగు పాదయాత్రలను సెప్టెంబర్ ఒకటి మార్పు కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ రామారెడ్డి మండల కేంద్రంలో భారీ ర్యాలీ అనంతరం రాజమ్మ తండాలో రైతులతో సదస్సు నిర్వహించడం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు. పశ్య పద్మ. సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. బాల్ రాజ్. నాయకులు ఎస్ డి. హైదర్ రాజమణి దేవయ్య ప్రవీణ్ రఫీ క్. శ్రీనివాస్. మౌలాన్ బి. శుక్రు. రాజ్ మహమ్మద్. శ్యామల. లక్ష్మి. శివప్రసాద్. సంపత్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
