పినపాక నియోజకవర్గ యువతకు స్థానికంగా వంద శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలి

మంత్రి డా. వివేక్ వెంకటస్వామికి సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి వినతి

Published On
పినపాక నియోజకవర్గ యువతకు స్థానికంగా వంద శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలి

 

 

మణుగూరు : లోకల్ గైడ్ న్యూస్ :
పినపాక నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు స్థానికంగానే వంద శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనులు, భూగర్భ శాఖల మంత్రి డా. వివేక్ వెంకటస్వామిని కోరారు. మంగళవారం మణుగూరులో మంత్రి పర్యటన సందర్భంగా కర్నె రవి మంత్రిని కలిసి కార్మికులు, స్థానిక నిరుద్యోగ యువత, భూనిర్వాసితులు, విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. పినపాక నియోజకవర్గం గనులు, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ స్థానిక యువతకు తగిన స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదన్నారు. సారపాకలోని ఐటీసీ కర్మాగారం, అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్, మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, సింగరేణి గనులతో పాటు ప్రైవేట్ కంపెనీలు, మైనింగ్ కాంట్రాక్టర్లు, అనుబంధ పరిశ్రమల్లో అర్హత కలిగిన స్థానిక యువతకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలోని యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మణుగూరులోని ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్‌డ్ టెక్నికల్ సెంటర్‌ను మరింత బలోపేతం చేసి మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈవీ టెక్నాలజీ, గ్రీన్ మొబిలిటీ, నిర్మాణ రంగం తదితర పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగ ఆధారిత కోర్సులను విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి, భద్రాద్రి పవర్ ప్లాంట్, ఐటీసీ, హెవీ వాటర్ ప్లాంట్ తదితర ప్రాజెక్టుల వల్ల ప్రభావితమైన భూనిర్వాసిత కుటుంబాలకు ఉపాధి, పునరావాసం, పునరావాస ప్రయోజనాలు కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, బోనస్, సెలవులు, భద్రతా ప్రమాణాలు తదితర చట్టబద్ధ హక్కులు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సమర్థవంతమైన గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. స్థానిక గిరిజన యువత కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్, కెరీర్ గైడెన్స్, అప్రెంటిస్‌షిప్ కార్యక్రమాలను విస్తరించాలని, కార్మికులు, భూనిర్వాసితులు, నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు మణుగూరులో ప్రత్యేక లేబర్, ఎంప్లాయ్‌మెంట్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని మంత్రి డా. వివేక్ వెంకటస్వామిని కోరినట్లు కర్నె రవి తెలిపారు. తన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని, కార్మికులు, స్థానిక యువత, భూనిర్వాసితులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హామీ ఇచ్చినట్లు కర్నె రవి పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...