- District News
- Ranga Reddy
- వట్టి నాగులపల్లి లో ప్రమాదకరంగా మారిన రోడ్డు...
వట్టి నాగులపల్లి లో ప్రమాదకరంగా మారిన రోడ్డు...
కనీస మరమ్మతలను చేపట్టండి
గండిపేట్, ఆగస్టు 9 (లోకల్ గైడ్),: 100 ఫీట్ల రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న ఎవరు పట్టించుకోవడంలేదని స్థానిక టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దార మహేందర్ ఆరోపించారు. గ్రామ ప్రజలు వాహనదారులు... వట్టినాగులపల్లి లో 100 ఫీట్ల రోడ్డు సంవత్సరాలుగా రోడ్డు పూర్తిగా శిథిలావస్థలోకి మారిందని
నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని గుంతల మయంగా మారి అస్తవ్యస్తంగా రోడ్డు ఉండడంతో రాకపోకలు సాగించడం చాలా కష్టంగా మారిందని దీనికి తోడు ప్రమాదాలు నెలకొంటున్నాయని ఆయన వాపోతున్నారు. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వన్ సైడ్ రోడ్డు వేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోడ్డు వైపు ఇక్కడి పరిస్థితుల వైపు కన్నెత్తి చూడడం లేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు ఎన్నోసార్లు ఈ సమస్యను వివరించామని ఆయన ఇప్పటివరకు పట్టింపు లేదని, కనీసం మరమ్మత్తులు చేపట్టకుండా ఈ రోడ్డున ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధుల్లో ఎలాంటి స్పందన లేకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డు సమస్య పరిష్కరించకపోతే గ్రామ ప్రజలందరీ ఆధ్వర్యంలో పెద్ద ధర్నా అయిన చేస్తామని ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే లేదని హెచ్చరిస్తున్నామన్నారు.
