- District News
- Ranga Reddy
- పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాల్సిందే.
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాల్సిందే.
జేఏసీ చైర్మన్ యశ్వంత్, కన్వీనర్ డా. రామారావు
Published On
By Ram Reddy
ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు,ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సీ పి ఎస్ అనేది ఉద్యోగస్తుల పట్ల శాపంగా మారిందని, ఈ సిపిఎస్ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగ జేఏసీ కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ 10వ తేదీన "చలో హైదరాబాద్ " కార్యక్రమాన్నిచేపడుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అదే విధంగా రంగారెడ్డి జిల్లాటి జీ ఈ జే ఏ సీ కన్వీనర్ డాక్టర్ రామారావు మాట్లాడుతూ సీ పి ఎస్ అనేది చాలా ప్రమాధకరమైనదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీని దాటవేయటం సరైంది కాదన్నారు.
ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, నాలుగవ తరగతి ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు అందరూ ఐక్యంగా ముందుకు వచ్చి తమ సంపూర్ణ మద్దతును తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వినర్ శ్రీనేష్ కుమార్ నోరి, కో చైర్మన్లు గోపాల్, ప్రవీణ్, శాంతి శ్రీ, సుధాకర్,రాజేష్, బల్వంత్ రెడ్డి,వైస్ చైర్మన్లు నూతనకంటి వెంకట్, సైదమ్మ, రాకేష్, సెక్రెటరీలు , మాధవ్ , ఆనంద్, మహేష్, ప్రమీల,వెంకటప్ప,పాండు రంగారెడ్డి, కల్పన, జగన్నాథ్ శర్మ,అరుణ,గౌస్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
12 Sep 2026 22:19:25
లోకల్ గైడ్ షాద్ నగర్ కేశంపేట: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల...
