ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.

 ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు వచ్చారని అధికారులను నిలదీస్తున్న ప్రజలు. ఆస్తి పన్ను వసూలుకు సమయపాలన లేదా.... అప్పులోల్లా రాత్రిపూట వచ్చారని అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు. . సమయపాలన లేకుండా ఆస్తిపన్ను వసూలు కోసం వెళ్లిన అధికారులు, సిబ్బందికి ఎదురవుతున్న చేదు అనుభవాలు. మార్చి 31వ తేదీ లోపు ఆస్తి పన్ను వసూలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలతో రాత్రి,పగలనకా వసూళ్లకు వెళ్లిన అధికారులు సిబ్బంది. రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ): ఎంత రాత్రి అయినా సరే ఆస్తిపన్ను వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో కిందిస్థాయి అధికారులు, సిబ్బందికీ షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో చేదు అనుభవాలు ఎదురైనట్లు తెలిసింది. ఏడాది ఆర్థిక సంవత్సరం మార్చి 31 తో ముగియనుండటంతో ప్రభుత్వ ఆదేశాలను సారం మున్సిపల్ అధికారులు ముమ్మరంగా ఆస్తిపన్ను వసూళ్లకు దిగారు. మార్చీ 31 ఒక్క(చివరి ) రోజే గడువు ఉండటంతో రాత్రి పగలనకా కాలనీలు, బస్తీల్లో ఆస్తి పన్ను వసూలుకు వెళ్లిన అధికారులను ఆస్తిపన్నుదారులు కాలనీలో ఏం అభివృద్ధి చేశారని సమయపాలన లేకుండా ఆస్తిపన్ను వసూలుకు వచ్చారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. ఆస్తి పన్ను వసూలుకు వెళ్లిన కొందరు సిబ్బందికి ప్రజల నుంచి అనేక చేదు అనుభవాలు ఎదురైనట్లు కొందరు సిబ్బంది వాపోయారు. ఆస్తిపన్ను వసూలే టార్గెట్ గా విధులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో బిల్ కలెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది ఒకవైపు కమిషనర్ ఒత్తిడి... మరోవైపు ప్రజల నుంచి ఎదురయ్య చేదు అనుభవాలతో తీవ్ర ఒత్తిడికీ గురవుతున్నారు. ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నయని కొందరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తిపన్ను వసూలు చేయాల్సిందే... ఎవ్వరు కూడా ఎలాంటి సెలవులు, పండుగలు ఇతర ఈ కార్యాలకు వెళ్ళేది లేదని కమిషనర్ తీవ్రమైన వత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏ బాధ వచ్చినా కూడా సెలవు పై వెళ్లలేని దుస్థితి నెలకొందని కొందరు ఉద్యోగులు వాపోయారు. ఆశపన్ను వసూలు కోసం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి వరకు ఎంత సమయం పడుతుందో.... ఎప్పుడు ఇంటికి వెళ్తాము తెలియని పరిస్థితులు నెలకొన్నాయని సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆస్తిపన్ను వసూళ్లకు ఎలాంటి సమయపాలన లేదా...? అప్పులు ఇచ్చినోళ్ళలా ఆస్తి పన్ను కోసం ఇల్ల చుట్టూ తిరుగుతున్నారని ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మా బస్తీలు, కాలనీలో ఏం అభివృద్ధి చేశారని రాత్రిపూట ఆస్తి పన్ను వసూళ్లకు వచ్చారని అధికారులు సిబ్బందిని ప్రజలు నిలదీసినట్లు సమాచారం. ఈ పని ఒత్తిడితో ఉద్యోగం కొనసాగించడం కష్టంగా మారిందని, అనారోగ్యాలపాకు గురవుతున్నట్లు కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. ఈ పనివత్తిడితో సమయానికి భోజనం చేయకపోవడమే కాకుండా కనీసం చాయ్, నీళ్లు తాగలేని పరిస్థితితులు నెలకొన్నాయి. అదనంగా పని చేసినప్పటికీ ఎలాంటి అదనపు జీతం లేదా అలవెన్స్‌లు ఇవ్వడం లేదని, పెట్రోల్ సౌకర్యం కూడా కల్పించకపోవడంతో ఖర్చులు తమపై పడుతున్నాయని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. IMG-20260330-WA0334

శ్రీరామ నవమి పండుగ రోజున కూడా టాక్స్ కలెక్షన్ల కోసం తిరగాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లి వసూళ్లు చేయాల్సి రావడం వల్ల ప్రజలకు కూడా అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.

గత మూడు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, మండుటెండల్లో కూడా ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేయాల్సి వస్తోందంటున్నారు.

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం