ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పిఆర్టియూ ధ్యేయం.

ఉపాధ్యాయుల పక్షపాతిగా నిలిచి అనేక జీవోలు సాధించిన ఘనత పిఆర్టియూదే. - పిఆర్టియూ సభ్యత్వాన్ని పొంది సంఘం అభివృద్ధికి కృషి చేయాలి.

పెద్దేముల్ మండల నూతన అధ్యక్షురాలు విజయలక్ష్మి. - పిఆర్టియూ మండల ప్రధాన కార్యదర్శి గోబ్ర్యా నాయక్. -  విజయవంతంగా ముగిసిన మండల సర్వసభ్య సమావేశం.
Published On
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పిఆర్టియూ ధ్యేయం.

లోకల్ గైడ్/తాండూర్:* 
 ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న సంఘం పిఆర్టియూ మాత్రమేనని ఆ సంఘం నూతన అధ్యక్షురాలు విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గోబ్ర్యా నాయక్ అన్నారు.సోమవారం రాత్రి తాండూర్ పట్టణంలోని ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో పెద్దేముల్ మండల పిఆర్టియూ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.... ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టియూ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
ఉపాధ్యాయుల పక్షపాతిగా నిలిచి వారి సంక్షేమం కోసం అనేక రకాల ప్రభుత్వ ఉత్తర్వులు (జీ.వో.) సాధించిన ఘనత పిఆర్టియుకే దక్కుతుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని అన్నారు.
మండల అధ్యక్షులు పోల నవీన్ కుమార్ మాట్లాడుతూ... నాయకుడిగా కాకుండా సేవకుడిగా ఉపాధ్యాయుల సేవలో తరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని పిలుపునిచ్చారు.
సంఘం బలోపేతానికి సభ్యులంతా సమష్టిగా కృషి చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, గౌరవ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ద్యావరి నరేందర్ రెడ్డి, బాకారం జైపాల్ రెడ్డి, మండల కార్యదర్శి బి. వెంకట్ రెడ్డి, అక్కమహాదేవి, మండల విద్యాధికారి నర్సింగ్ రావు, పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
సిద్దిపేట, సెప్టెంబర్ 07(లోకల్ గైడ్): సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పవన్ మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్‌పీ) సిద్దిపేట...
ఇది ప్రజాస్వామ్యమా రాక్షస రాజ్యమా?
ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఐపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ
జర్నలిస్టులపై కలెక్టర్ నిర్లక్ష్యం తగదు ఫీజు రాయితీ జీవో వెంటనే విడుదల చేయాలి
నాడు ఫ్రెండ్లీ పోలీసు... నేడు రేవంత్ పోలీసు
రైతు కుటుంబానికి స్థిరమై న ఆదాయం కల్పించేలా ప్రణాళికలురూపొందించాలి
కనీస వేతనాల సలహా మండలి లో జాతీయ సంఘాలను చేర్చాలి