దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

బతుకమ్మ నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్

Published On
దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

IMG-20261008-WA0306

లోకల్ గైడ్ ఆమనగల్లు, అక్టోబర్ 8:
దసరా, శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పత్యా నాయక్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక హనుమాన్ దేవాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు, సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు.
ఈ నెల శనివారం నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండటంతో బతుకమ్మల నిమజ్జనం కోసం చెరువు వద్ద స్థలాన్ని చైర్మన్ పరిశీలించారు. చెరువులో నీటి మట్టం తక్కువగా ఉండటాన్ని గమనించి, నిమజ్జనానికి అనువైన ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చించారు.
నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ, దసరా వేడుకలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత తదితర ఏర్పాట్లపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. రాఘవేందర్ రెడ్డి, మేనేజర్ ఆంజనేయులు, కౌన్సిలర్లు ఎంగలి భాగ్యమ్మ, ముక్కాల వెంకటయ్య, ఎర్రబోలు మహేష్, నాగిళ్ల జగన్, కో-ఆప్షన్ సభ్యుడు ఖాదర్, మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు, పూసలి సత్యం, సురేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి  జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి 
లోకల్ గైడ్:మద్దూర్ నారాయణ పేట జిల్లా దన్వాడ మండలం  గున్ముకుల   గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 60 గ్రామాలు పాల్గొనడం జరిగింది ఆతరువాత డ్ర వేయడం జరిగింది...
గేట్ కారేపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కల్లూరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ ఫ్రీజ్‌పై సుంకేట పోశెట్టి ఆవేదన ఎస్సీ సర్పంచ్‌పై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు.. చెక్‌ పవర్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌.
సీనియర్ నాయకులు కొట్టేరు శ్రీనివాస రెడ్డి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
నేడు డిప్యూటీ సీఎం పర్యటనకు సింగరేణి సర్పంచులు సన్నద్ధం కావాలి! రంజిత్ కుమార్ 
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ నవదుర్గా ఉత్సవ కమిటీ