- District News
- Ranga Reddy
- ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.
రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ స్వర్ణ కుమారి. రంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆకస్మిక తనిఖీ
తనకిలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ స్వర్ణ కుమారి
Published On
By Ram Reddy
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, రోగుల హాజరు, సిబ్బంది విధుల నిర్వహణ, మందుల నిల్వలు, ల్యాబొరేటరీ సేవలు, ప్రసవ సేవలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆసుపత్రిలో పారిశుద్ధ్య ప్రమాణాలను పాటించాలని, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ స్వర్ణ కుమారి సూచించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
14 Sep 2026 19:49:54
గణేష్ ప్రతిష్టలో ఇరువర్గాల మధ్య ఘర్షణ -పోలీసుల రంగ ప్రవేశం. సంఘటన పై భక్తుల అసంతృప్తి.
