- District News
- Ranga Reddy
- సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత ప్రవర్తనకు నిరసనగా భగ్గుమన్న మహేశ్వరం
సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత ప్రవర్తనకు నిరసనగా భగ్గుమన్న మహేశ్వరం
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం అసెంబ్లీ సాక్షిగా మహిళా నేతను అవమానించడం దుర్మార్గం.
మహేశ్వరం, ( లోకల్ గైడ్ ): అసెంబ్లీ సాక్షిగా మహేశ్వరం శాసనసభ్యురాలు, తెలంగాణ తొలి మహిళా హోం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన తీరు, పోలీసుల వైఖరిని నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. జల్ పల్లి సర్కిల్ పరిధిలోని 65వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు..... మాట్లాడుతూ... ఒక సీనియర్ మహిళా నాయకురాలిని, ప్రజా ప్రతినిధిని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించడం వారి అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు. తెలంగాణ సమాజం సబితమ్మను గౌరవిస్తుంటే, అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు యాంజాల జనార్దన్, పల్లపు శంకర్, ఎస్కే అఫ్జల్, యంజాల అర్జున్, సయీద్ పటేల్, పి. నాగేష్ ముదిరాజ్, సూరెడ్డి గోపాల్ రెడ్డి, నవాబ్ పేట ఆంజనేయులు, నర్సింగ్, ఎస్ నాగభూషణం, సయ్యద్ అబ్బాస్, సయ్యద్ ఇద్రిస్, సురెడ్డి వినయ్ రెడ్డి, మారుతి, బి. శంకర్, గౌస్ బాయ్, అజ్జు, సయ్యద్ జిషాన్ మరియు అధిక సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
