ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలి -బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి. 

అసెంబ్లీ ముట్టడించిన తోకల శ్రీనివాస్ రెడ్డి, ఇతర బిజెపి నాయకులు. 

Published On
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలి -బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి. 



రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):                                       
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకొంటుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని  డిమాండ్ చేస్తూ
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు పిలుపు మేరకు అసెంబ్లీని ముట్టడించడం జరిగిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు ₹1,500కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్  బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తే అనుమతి ఇవ్వలేదు ఈ చేతగాని రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయాన్నారు. 
తెలంగాణ లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఎంతోమంది విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో కీలకమైనదన్నారు. నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు,  వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా  పోలీసులు తోకల శ్రీనివాస్ రెడ్డిని అసెంబ్లీ ప్రాంగణంలో అరెస్ట్ చేసి సికింద్రాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బిజెపి నాయకులు . పాండు యాదవ్, అడికే జనార్ధన్, సంతు గౌడ్, మధుసూదన్ రెడ్డి, మన్మోహన్ రెడ్డి, తలారి చిన్న, అమర్ రెడ్డి, మాగాణి శివ, పవన్ సాయి, హర్ష వర్ధన్, లంకల సాయి, శంకర్ రెడ్డి, బీజేపీ & బిజీవైఎం నాయకులు పాల్గొనారు.

Tags:

About The Author

Latest News

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి.
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తాతా మధు దూషించడం సరికాదని ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్...
దళితులంటే బిఆర్ఎస్ పార్టీకి అంత చిన్న చూపా*? దళితుల జోలికి వస్తే ఖబడ్దార్ : ,
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి.
పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సట్టు సైదులు.
జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి 
గణేష్ ఉత్సవాల్లో డిజే లకు అనుమతి లేదు.        
ఫిరంగినాలపై అక్రమ నిర్మా ణాలు.......