వంగూరి వాచకం- నవరత్నాలు 

Published On
వంగూరి వాచకం- నవరత్నాలు 

 

1. అందరి నోటా తరచుగా 
వినిపించు మాట టైం లేదు 
నెట్వర్క్ కట్టయితే మాత్రం 
కానివారెందరో టైం పాస్.

2.ఎవ్వరు లేకున్నా 
ఉంటుంది కదా నీ తోడ 
చివ్వున వదులు నిన్ను 
చీకటికి భయపడి నీ నీడ

3. దగ్గర చేసిన 
టెక్నాలజీ 
దూరం పెంచుతున్న 
సైకాలజీ .

4.గెలుపు 
ఇస్తుంది బలుపు 
బలుపు 
తెస్తుంది మరుపు.

5. దువ్వకపోతే 
చిక్కులే కదా 
నీ తలనైనా 
నేతలనైనా.

6.అదుపు తప్పిన 
నాలిక 
అదను చూసే వారి 
కోరిక.

7.ఆవేశం 
తెలివికి తెరవేస్తుంది 
ఆలోచన 
తెలివికి తెరతీస్తుంది.

8. .గొప్పవాడను నాకేమని 
విర్రవీగితే ఎలా చెప్పు 
సూర్యచంద్రులకైనా తప్పునా 
గ్రహణం ముప్పు.

9. మాటలు కుదిరితే 
కడతారు మావిడాకులు 
మాటలు ముదిరితే 
కోరుతారు విడాకులు.

వంగూరి గంగిరెడ్డి 
షాద్ నగర్ 
9652286270

Tags:

About The Author

Latest News