- District News
- Ranga Reddy
- ఆమనగల్లులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
ఆమనగల్లులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు.. బాణాసంచాతో సంబరాలు
— లోకల్ గైడ్
ఆమనగల్లు, ఆగస్టు 22:
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఆమనగల్లులో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి చిరంజీవి అభిమానుల అసోసియేషన్ అధ్యక్షుడు బికుమాండ్ల నరసింహ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బికుమాండ్ల నరసింహ అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిమానులు బాణాసంచా పేల్చుతూ, ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. చిరంజీవి సినీ రంగంలో తనదైన ముద్ర వేయడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలందిస్తూ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. చిరంజీవి ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవిస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో గిరి యాదవ్, అంకం సత్యం, చందు నాయక్, హరి, నాజర్, రఫీ, మహేష్, నరేష్, మహేందర్, గోపాల్, వెంకటేష్ తదితర చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.
