బేగంపేటలో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సత్తయ్యకు రసమయి బాలకిషన్ నివాళి

Published On
బేగంపేటలో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సత్తయ్యకు రసమయి బాలకిషన్ నివాళి

బెజ్జంకి, ఆగస్టు 9(లోకల్ గైడ్):

బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బొల్లం సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ రసమయి బాలకిషన్ ఆదివారం ఆయన మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం సత్తయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ భద్రత కోసం నిబద్ధతతో విధులు నిర్వహించిన సత్తయ్య సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సత్తయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు మైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, శ్రీనివాస్ గుప్తా, లక్ష్మారెడ్డి, ఎలా శేఖర్ బాబు, పవన్, పోచయ్య, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు