రేపటి సీఎం రేవంత్ రెడ్డి పాలేరు నియోజకవర్గ పర్యటనను జయప్రదం చేయండి : తుంబూరు దయాకర్ రెడ్డి పిలుపు

సమాచార శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మన పాలేరు.

Published On
రేపటి సీఎం రేవంత్ రెడ్డి పాలేరు నియోజకవర్గ పర్యటనను జయప్రదం చేయండి : తుంబూరు దయాకర్ రెడ్డి పిలుపు

లోకల్ గైడ్ పాలేరు: మన ప్రియతమ నేత, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మన పాలేరు  నియోజకవర్గంలో ఈ నెల 18న ఆదివారం (రేపు) ఉదయం 10:30 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పర్యటించనున్నారు. ఈ పర్యటనను భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పొంగులేటి గారి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

మద్దులపల్లి వేదికగా సీఎం గారు 100 పడకల ఆసుపత్రి (కూసుమంచి), జేఎన్టీయూ కళాశాల, మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే నర్సింగ్ కళాశాల మరియు కొత్త వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని  ఆత్మ కమిటీ, సీడీసీ, మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, దేవాలయ కమిటీ బాధ్యులు మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ ఉదయం 10:30 గంటలకే హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

Tags:

About The Author

Latest News

ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి
లోకల్ గైడ్ బెజ్జంకి జూన్ 22: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజా సమస్యలను పక్కనపెట్టి తన అనుచరుల పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఐ జిల్లా నాయకుడు...
నువా డైమండ్ ఆభరణాల కలెక్షన్ను ఆవిష్కరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కోకాపేటలో
నీట్ రీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు....
ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం కోసం అంగన్వాడీల కృషి అభినందనీయం -గుడిమల్కాపూర్ డైరెక్టర్ బండారి శంకర్
రవీంద్రభారతిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వి హెచ్ హనుమంతరావుకు ఘన సన్మానం 
8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ:
వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పని చేయాలి ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్