సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి.

మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను ప్రారంభించాలి.

Published On
సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి.

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు19
(లోకల్ గైడ్ న్యూస్)

డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చే ప్రతి క్లెయిమ్, అభ్యంతరాన్ని నిర్ణీత గడువులో పరిష్కరించాలి,అర్హత కలిగిన ప్రతి ఓటరు హక్కును పరిరక్షించేందుకు అన్ని చర్యలు,జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి,సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. 
ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చాహత్ బాజ్ పాయి, ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఆగస్టు 17న విడుదలైన డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అన్ని స్థాయిల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించి, వారి నుంచి వచ్చే అభిప్రాయాలు, క్లెయిమ్స్, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం స్వీకరించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించిన అనామలీస్ (Anomalies), మ్యాపింగ్ జరగని ఓటర్ల వివరాలను పరిశీలించాలని, సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. నోటీసుల జారీ ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టి, సంబంధిత ఓటర్లకు తమ వివరణను అందించే అవకాశం కల్పించాలని సూచించారు.డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చే ప్రతి క్లెయిమ్, అభ్యంతరాన్ని నిర్ణీత గడువులో పరిష్కరించాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటు హక్కును పరిరక్షించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించిన మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలీస్ కేసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. నోటీసుల జారీ అనంతరం ఓటర్ల నుంచి అందే వివరణలు, సంబంధిత పత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ వీసీ లో కలెక్టర్ మాట్లాడుతూ..
మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలీస్ గుర్తించిన వారికి నోటీసులు జారీ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై అందే ప్రతి క్లెయిమ్, అభ్యంతరాన్ని నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా జిల్లాలో అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.అర్హత కలిగిన ప్రతి ఓటరు హక్కును పరిరక్షించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్  వివరించారు.
ఈ సమావేశంలో  ఆర్డీవోలు  వెంకటేష్, వెంకన్న, ఎలక్షన్ సూపరింటెండెంట్  జగత్ సింగ్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News