విద్యార్థులతో కలిసి అసంపూర్తి భవనం వద్ద యువత నిరసన

తేగడ హైస్కూల్‌లో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్

Published On
విద్యార్థులతో కలిసి అసంపూర్తి భవనం వద్ద యువత నిరసన

 

 

చర్ల : లోకల్ గైడ్ :
చర్ల మండల పరిధిలోని తేగడ ప్రభుత్వ హైస్కూల్‌లో అసంపూర్తిగా నిలిచిపోయిన అదనపు తరగతి గదుల భవనం వద్ద బుధవారం విద్యార్థులతో కలిసి స్థానిక యువత నిరసన చేపట్టింది. తరగతి గదుల కొరత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే భవన నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఎఫ్‌సీ నిధుల నుంచి రూ.16 లక్షలు మంజూరు చేసి అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ, భవనం పైన విద్యుత్ లైన్ ఉండటంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు తెలిపారు. నిర్మాణానికి ముందు స్థలాన్ని, విద్యుత్ లైన్ల పరిస్థితిని సరిగా పరిశీలించకుండా పనులు ప్రారంభించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు. పాఠశాల ఆవరణలో తగినంత స్థలం ఉన్నప్పటికీ సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రజాధనం వృథా అవుతోందని యువత ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా యువ నాయకుడు పెద్దిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువ న్యాయవాది పరిటాల సంతోష్ మాట్లాడుతూ అసంపూర్తిగా నిలిచిపోయిన భవనంపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు శ్రీను, రాజు, పెద్దిరెడ్డి, నిరంజన్, నవీన్, పరిటాల సంతోష్, మద్ది లక్ష్మీనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News