విక్టరీ వెంకటేష్ స్పీడ్ కి యంగ్ హీరోలు కూడా షాక్!
సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్, ఇటీవల ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ సీజన్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సీజన్ వల్ల తన ఇమేజ్‌కి కొంచెం నష్టం జరిగిందన్న విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని రెండో సీజన్ ను జాగ్రత్తగా తెరకెక్కించారు. ఇప్పుడు ఆ సక్సెస్ తో వెంకీ గేర్ మార్చి, యంగ్ హీరోలతో పోటీ పడేలా నాలుగు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెట్టేశాడు.ఆ నాలుగు సినిమాలు ఏడాదిలోపే రిలీజ్ కాబోతున్నాయి అంటే వెంకటేష్ స్పీడ్ అర్థం చేసుకోవచ్చు. మొదటగా, అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మెగా157’ లో వెంకటేష్ గెస్ట్ రోల్ చేయనున్నాడు. ఈ సినిమాలో వెంకీ కోసం మూడు నుండి నాలుగు వారాల కాల్ షీట్స్ కూడా కేటాయించారట. 2026 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.‘మెగా157’ తర్వాత అందరికీ ఆసక్తి రేపుతున్న త్రివిక్రమ్–వెంకటేష్ కాంబినేషన్ సినిమా మొదలవుతుంది. వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలకు రైటర్‌గా పని చేసిన త్రివిక్రమ్ డైరెక్టర్‌గా మారిన తర్వాత వెంకీతో సినిమా చేయలేదని తెలిసి అందరికి ఎప్పటి నుంచో ఆసక్తి. ఇప్పుడు ఆ కాంబో రియాలిటీ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2026 సమ్మర్ లో రిలీజ్ కానుంది.దీంతో ముగియలేదు. 2027 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ మళ్లీ ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ తో మరో సినిమా చేయబోతున్నాడు. అంటే ‘మెగా157’ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ మరోసారి తన ఎనర్జీ చూపించనున్నాడు.సరే.. మొత్తంగా చెప్పాలంటే, విక్టరీ వెంకటేష్ వచ్చే 365 రోజుల్లో నాలుగు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఈ స్పీడ్ చూసి యంగ్ హీరోలు కూడా ఆశ్చర్యపోతున్నారు!