హోంగార్డ్స్ విభాగానికి వులెన్ జాకెట్స్ ప్రధానం చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య...
By Ram Reddy
On
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్స్ సిబ్బందికివర్షాకాలం మరియు చలికాలంలో విధుల నిర్వహణ కష్టం అవుతదన్న ముందు జాగ్రత్తలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నిజామాబాదులోని 369 మంది హోంగార్డ్స్ కు వులెన్ జాకెట్స్ అందజేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలం మరియు చలి కాలం సమీపిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ వులెన్ జాకెట్స్ ను సద్వినియోగం చేసుకోవాలని విధినిర్వహణలో కూడా క్యారీ చేసి అవసర నిమిత్తం ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ విభాగం ఇన్చార్జ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ సతీష్ , వెల్ఫేర్ విభాగం రిజర్వ్ ఇన్స్పెక్టర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు..
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...