పల్లె దవాఖాన వైద్యుల సమస్యలు పరిష్క రించాలి..!!
*నేషనల్ హెల్త్ మిషన్ కమిషనర్ కు వినతి.
లోకల్ గైడ్ మహబూబాబాద్
ఆవిష్కృతం గా ఉన్న పల్లె దావాఖాన వైద్యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా పల్లె దావాఖాన వైద్యుల జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోరండ్ల శ్రీకాంత్ డిమాండ్ చేశారు.శనివారం నేషనల్ హెల్త్ మిషన్ కమిషనర్ డాక్టర్ సంగీతను శ్రీకాంత్ నేతృత్వంలో మర్యాద పూర్వకంగా కలిసిపుష్ప గుచ్చామును అందజేసి పలు సమస్యలను విన్నవించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, జిల్లాలోని పల్లె దవాఖాన వైద్యుల డిసిగ్నేషన్ చేంజ్ ,పెండింగ్ శాలరీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరి చేయాలన్నారు.పెండింగ్ శాలరీ విషయం పై ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క దృష్టి కి తీసుకెళ్లడం జరిగిందన్నారు.కొద్ది రోజుల్లోనే పెండింగ్ శాలరీలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ,పలుసమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించి త్వరలో మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా పల్లె దవాఖాన వైద్యుల అసోసియేషన్ వైద్యులుడాక్టర్,షఫీ,నరేష్, నవీన్.కిరణ్మయి,వాణి రవళి ,స్పందన ,అనూష .నిఖిల,సాయి శ్రీలత, స్వాతి,ప్రతిభ. శివ తదితరులు పాల్గొన్నారు.