మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలి
By Ram Reddy
On
కామారెడ్డి ,లోకల్ గైడ్ :
జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా , వినియోగాన్ని అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు . అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నివారణ కార్యాచరణ జూన్ 26 వ తేదీన జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు . ఇందులో భాగంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం కలెక్టరేట్ లో పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గురువారం (26 వ తేదీ ) ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని సి ఎస్ ఐ చర్చ్ నుండి కళాభారతి వరకు ర్యాలీ గా వెళ్లి అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు . ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల , ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...