వంగూరి వాచకం -నవరత్నాలు
By Ram Reddy
On
1.ఆదిత్యుడిని బంధించేవి
ఆషాఢ మేఘాలు
ఆమ్లజనిని దిగ్బంధించేను
ఆకాశ హర్మ్యాలు
మాటలే ఉపశమన లేపనం అశోకవనంలోని సీతకు
త్రిజట మాటలే కదా సాంత్వనం.
3.పాపాయి నవ్వితే
కన్నుల పండుగ
రూపాయి పెరిగితే
కడుపుకు పండుగ
4.మంట ఎంత ఎగిసినా
బూడిదయ్యేది భూమి మీదేగా
ఉయ్యాల ఉన్నతమెంతైనా
ఆగేది ఉన్నచోటేగా.
5.మోకాళ్లు గాయపడని
శైశవం అసాధ్యం
కళ్ళు తడవని
సంసారం అశక్యం.
6.స్వరాజ్యసాధనకు
క్విట్ ఇండియా ఉద్యమకీల
వలస పాలనకు
విసరు పెట్టిన అగ్నిజ్వాల
7.మానసిక బలం
మంచి బలమిచ్చే టానిక్
బలహీనుడు సైతం
బాహుబలి అయ్యే టెక్నిక్
8.చిన్న చిన్న ఇబ్బందులకే
చిరాకు పడతావెందుకు?
ఎన్ని అవరోధాలు ఎదురైనా
మొక్క ఎదిగిపోదా ముందుకు
9.సాధనే చేతనకు
సోపానం
రోదన్ వేదనకు
సాంత్వనం
వంగూరి గంగిరెడ్డి
9652286270
షాద్ నగర్
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...