ఫ్యామిలీతో మాల్దీవ్స్ లో సరదా.. కాజల్ చందమామకు హిట్ కోసం ఎదురుచూపు!
By Ram Reddy
On
టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే తన 40వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కాజల్, కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో వివాహ బంధంలోకి అడుగుపెట్టి, కొద్ది కాలానికి తల్లి అయ్యింది.బాబు పుట్టిన తర్వాత కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన కాజల్, మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తోంది. అయితే రీ ఎంట్రీ తర్వాత ఆశించిన హిట్లు, స్టార్డమ్ మాత్రం ఆమెను వెంటాడడం లేదు.తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన సికందర్ సినిమాలో కాజల్ ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదైనా, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ సికందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడంతో, అది కూడా కాజల్‌కు పెద్దగా కలిసిరాలేదు.
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...