రేపే వ‌స్తున్న ‘భూ అంటే భూతం..’సాంగ్.....

 రేపే వ‌స్తున్న ‘భూ అంటే భూతం..’సాంగ్.....

లోక‌ల్ గైడ్:
 నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మాస్ ఎంటర్టైనర్‌ ‘తమ్ముడు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ఆదివారం ఫస్ట్‌ సింగిల్‌ ప్రకటనను విడుదల చేసింది. ‘భూ అంటే భూతం..’ అనే ఈ గీతాన్ని ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.హీరో తన మేనకోడల్ని ఆడిస్తూ పాడే ఈ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్‌ తెలిపారు. సంగీత దర్శకుడు అజనీష్‌ లోకనాథ్‌ ఈ పాటకు అద్భుతమైన స్వరాలు అందించగా, గాయకుడు అనురాగ్‌ కులకర్ణి తన ప్రత్యేక శైలిలో పాడి ప్రేక్షకులను మెప్పించనున్నాడు.స్వసిక విజయన్‌, బేబీ శ్రీరామ్‌దిత్య తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా, సినిమాటోగ్రఫీ కేవీ గుహన్‌, నిర్మాణ బాధ్యతలు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ వహిస్తున్నాయి.

Tags:

About The Author

Latest News