నిప్పు అప్పు పగ వద్దు

ఆత్మీయతే హద్దు

మనిషికి నిప్పు 
అప్పు పగ వద్దు 
ఈ మూడు గుణాలు
తమంతట తాము 
తరగవు
పెరుగుతూనే 
ఉంటాయి అందుకే
నిప్పును అర్పేయాలి 
అప్పును తీర్చేయాలి 
పగను సమూలంగా
వదిలేయాలి. 

వీటిని ఏమాత్రం
జాలి చూపిన 
మళ్ళీ చిగురిస్తాయి.
నిప్పు అప్పు పగ
వద్దు
ఆత్మీయతే హద్దు 
నీ పగనే నిన్ను
థహిస్తుంది 
నీ శాంతమే
నిన్ను రక్షిస్తుంది 

నీ మాటే 
నీ ఉనికిని
చాటుతుంది
నీ చేష్టలే
నీ వైఖరిని
చాటుతాయి

ప్రేమతత్వం
మానవత్వం
మనిషితత్వం
అవగాహన
ఆర్థత
పరోపకారం
నీ జీవన శైలి 
కావాలి

నువ్వు రాసిన 
ప్రతి అక్షరం
అద్భుతం
కాక పోవచ్చు 
కానీ ప్రతి 
అద్భుతాన్ని
ప్రపంచానికి 
పరిచయం
చేసేది మాత్రం 
అక్షరమే
అక్షరమే
అద్భుతాల సృష్టికి 
మూల కారణం
అక్షరాస్యతను
పరివ్యాప్తి చేద్దాం
అజ్ఞాన అధికారాన్ని
అంతం చేద్దాం

నేదునూరి కనకయ్య 
అధ్యక్షులు తెలంగాణ 
ఎకనామిక్ ఫోరం 
ఫ్రీలాన్స్ రైటర్ 
కరీంనగర్9440245771

Tags:

About The Author

Latest News