కెనడా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై ట్రంప్ సీరియస్… వాణిజ్య చర్చలకు బ్రేక్

కెనడా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై ట్రంప్ సీరియస్… వాణిజ్య చర్చలకు బ్రేక్

లోక‌ల్ గైడ్:కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కెనడా వెనక్కి తగ్గకపోవడంతో, అమెరికా–కెనడా మధ్య జరుగుతున్న అన్ని వాణిజ్య చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’ లో ట్రంప్, “కెనడాతో అన్ని రకాల వాణిజ్య చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నాం,”
అని స్పష్టంగా తెలిపారు.కెనడాలో డిజిటల్ సేవల పన్ను గతేడాది అమల్లోకి వచ్చినా, జూన్ 30 నుంచి కంపెనీలు చెల్లింపులు ప్రారంభించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టం ప్రకారం:
కెనడాలో గణనీయమైన ఆన్‌లైన్ ఆదాయం కలిగిన పెద్ద డిజిటల్ కంపెనీలు
తమ ఆదాయంపై 3% పన్ను చెల్లించాలి
ఈ పన్ను పరిధిలోకి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ సేవలు, ఆన్‌లైన్ ప్రకటనలు, సోషల్ మీడియా సేవలు, వినియోగదారుల డేటా అమ్మకాలు వస్తాయి.దీని ప్రభావం యూఎస్‌కి చెందిన టెక్ దిగ్గజాలు, ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ పై ఎక్కువగా ఉంటుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 30 నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి రానుండటంతో, ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి