ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ 2025-26 విద్యా సంవత్సరం పరీక్షల క్యాలెండర్ లను
ఆవిష్కరించిన రెవెన్యూ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
By Ram Reddy
On
లోకల్ గైడ్: ఖమ్మం : ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ 2025-26 విద్యా సంవత్సరంలో గాను ఒలింపియాడ్ పరీక్షల క్యాలెండర్ లను తెలంగాణ రెవెన్యూ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది . పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా ఒలంపియాడ్ సౌత్ ఇండియా డైరెక్టర్ అంతోటి రామకృష్ణాని మరియు వారి బృందాన్ని అభినందించారు . ఈ సందర్భంగా సౌత్ ఇండియా డైరెక్టర్ అంతోటి రామకృష్ణ మాట్లాడుతూ ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ గత 2016 సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ పోటీ పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు . అదే విధంగా సహకరిస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ దివ్య , డిస్టిక్ ఇంచార్జ్ శ్వేత తో పాటు పలువురు పాల్గొన్నారు .
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...