మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్న అల్లరి నరేష్.....
లోకల్ గైడ్: టాలీవుడ్‌లో మంచి టాలెంట్ ఉన్న నటుల్లో అల్లరి నరేష్ ఒకరు. తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాక, ఎమోషనల్ సీన్లలోనూ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చేస్తాడు ఈ అల్లరోడు. ఒకప్పుడు కామెడీ సినిమాలకే పరిమితమై ఉన్న అల్లరి నరేష్, ఇప్పుడు సాలిడ్ కంటెంట్ ఉన్న విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు.ప్రస్తుతం అల్లరి నరేష్ తన 63వ చిత్రంపై బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఆయనకు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. మెహర్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఆల్కహాల్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నేడు (అల్లరి నరేష్ బర్త్‌డే) సందర్భంగా మూవీ యూనిట్ టైటిల్ మరియు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పోస్టర్‌లో నరేష్ ఆల్కహాలిజం లో మునిగిపోయినట్టుగా కనిపిస్తుండగా, కథ భ్రమా లేదా వాస్తవమా అనే ప్రశ్న చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ అల్లరి నరేష్‌కి మరో హిట్ తీసుకువస్తుందని సినీ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి.ఇక నేడు ఆయన పుట్టినరోజు కావడంతో, సోషల్ మీడియాలో అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది.