హీరో కిరణ్ అబ్బవరం " K-ర్యాంప్" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్,

హీరో కిరణ్ అబ్బవరం

ఈ దీపావళికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. కిరణ్ అబ్బవరం లుంగీ కట్టులో మాస్, క్లాస్ కలిసిన మేకోవర్ లో ఆకట్టుకుంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో మందు బాటిల్స్ తో డిజైన్ చేసిన లవ్ సింబల్ కనిపిస్తోంది.  "K-ర్యాంప్" కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ దీపావళికి "K-ర్యాంప్"  మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Tags:

About The Author

Latest News