హెచ్‌సీఏ క్రికెట్ సలహా మండలి (CAC) చైర్మన్‌గా హైదరాబాదీ మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా
లోకల్ గైడ్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ప్రశాంత వాతావరణంలో పూర్తయింది. ఈ సమావేశంలో హెచ్‌సీఏ క్రికెట్ సలహా మండలి (CAC) చైర్మన్‌గా హైదరాబాదీ మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా పేరును మెజారిటీ సభ్యులు ప్రతిపాదించినట్టు సమాచారం. దీంతో ఆయన నియామకం లాంఛనమైంది.జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు అధ్యక్షతన డిస్ట్రిక్ట్ క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు 25 ఎకరాల భూమిని తక్కువ ధరకు పొందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, ఈ విషయంలో సంఘంలో సభ్యులుగా ఉన్న ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రఘురామ్ రెడ్డి కృషి చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వర్‌నాథ్ విజ్ఞప్తి చేశారు.