జూలై 1 నుంచి రైల్వేలో కొత్త నియమాలు..
టికెట్ ధరల పెరుగుదలతో పాటు కీలక మార్పులు
టికెట్ చార్జీల పెరుగుదల
నేటి నుంచి మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్ చార్జీలు పెరిగాయి.
-
ఏసీ కోచ్‌లలో ప్రతి కిలోమీటర్‌కు రెండు పైసలు
-
నాన్ ఏసీ క్లాస్‌లో ప్రతి కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున ఛార్జీలు పెరిగాయి.
రైల్వే శాఖ సోమవారం ఈ కొత్త ఛార్జీల పట్టికను విడుదల చేసింది. 2020 తర్వాత దాదాపు ఐదు సంవత్సరాల విరామంలో ఈ పెరుగుదల జరుగుతోంది. -
500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ టిక్కెట్లు, ఎంఎస్‌టి ఛార్జీలకు మార్పులు లేవు.
-
అయితే, 500 కిమీ కంటే ఎక్కువ దూరాలపై ప్రతి కిలోమీటర్‌కు అర పైసా అదనంగా చెల్లించాలి.
తత్కాల్ టికెట్ల బుకింగ్‌పై కఠిన నియమాలు
ఇకపై తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.
-
ఓటీపీ ఆధారిత అథెంటికేషన్ తప్పనిసరి.
-
బుకింగ్ మొదలైన మొదటి 30 నిమిషాల్లో ఏజెంట్లకు బుకింగ్ అనుమతి ఉండదు.
ఐఆర్‌సీటీసీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏజెంట్లు పెద్ద ఎత్తున టిక్కెట్లు బుక్ చేస్తున్నారని వచ్చిన విమర్శలే. దీంతో సాధారణ ప్రయాణికులకు మరింత అవకాశం లభించనుంది.
చార్టింగ్ వ్యవస్థలో మార్పులు
ఇకపై రైలు బయలుదేరే ఎనిమిది గంటల ముందే రిజర్వేషన్ చార్టులు సిద్ధం చేస్తారు.
ఉదాహరణకు, మధ్యాహ్నం 2గంటలకు బయలుదేరే రైలు చార్టులు ముందు రోజు రాత్రి 9గంటలకే సిద్ధం అవుతాయి.
దీంతో వెయిటింగ్‌లో ఉన్నవారు తమ స్టేటస్ ముందే తెలుసుకుని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి సౌలభ్యం కలుగుతుంది.
తత్కాల్ బుకింగ్‌లో వన్ టైమ్ పిన్ వెరిఫికేషన్
జూలై చివరినుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం డిజిలాకర్ ఆధారిత OTP వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. డిజిలాకర్ లేదా ఇతర ప్రభుత్వ ఐడీలలో సేవ్ చేసిన ఆధార్ కార్డ్ డేటాతో అథెంటికేషన్ పూర్తవుతుంది.
వెయిటింగ్ లిస్ట్ పరిమితి పెంపు
రైల్వే తాజాగా వెయిటింగ్ లిస్ట్ పరిమితిని పెంచింది.
-
ఏసీ తరగతుల్లో 25 శాతం నుంచి 60 శాతానికి
-
నాన్ ఏసీ తరగతుల్లో 30 శాతానికి పెంచారు.
సవరించిన సీఆర్‌ఐఎస్ ఉత్తర్వులు జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నాయి.