రెండో టెస్టు ముందే భారత్‌కు ఊరట.. బుమ్రా ఆడనున్నాడా?

రెండో టెస్టు ముందే భారత్‌కు ఊరట.. బుమ్రా ఆడనున్నాడా?

లోక‌ల్ గైడ్

ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు భారత్‌కు పెద్ద ఊరట లభించింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆడే అవకాశం ఉందని జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ ధృవీకరించారు. అయితే, బుమ్రా తుది జట్టులోకి వస్తాడా లేదా అన్న విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. జూలై 2 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.ఈ సిరీస్‌లో బుమ్రా ఐదు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ ప్రకారం, బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడు. ఇప్పటికే బుమ్రా రెండో టెస్టుకు అందుబాటులో ఉండబోవచ్చని వార్తలు వచ్చినప్పటికీ, డోస్చేట్ తాజాగా ఆయన ఆడతాడని చెప్పడం భారత్‌కు బలాన్నిస్తుంది. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్‌లు తొలి టెస్టులో ఆకట్టుకోకపోవడంతో బుమ్రా బర్మింగ్‌హామ్ టెస్టు ఆడడం కీలకంగా మారింది. బుమ్రా తొలిటెస్టులో మొత్తం 43.4 ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 24.4 ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీసగా, రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు వేసి వికెట్లు తీయలేకపోయాడు.ప్రస్తుతం బౌలింగ్ భారం అంతా బుమ్రాపైనే ఉంది. మరో ఎండ్ నుంచి అతనికి సరైన సహకారం లేకపోవడంతో ఒత్తిడి పెరుగుతోంది. బుమ్రా మూడు మ్యాచులు ఆడితే, మిగతా రెండు టెస్టుల్లో అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రశ్నగా మారింది.

Tags:

About The Author

Latest News

భగవంతుడు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది వైద్యుడు... భగవంతుడు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది వైద్యుడు...
  ప్రాణం కాపాడే పోరాట యోధులను సన్మానించుకోవడం గొప్పవరం... మెడికవర్ హాస్పిటల్స్
అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవు
ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ "ప్రేమిస్తున్నా''  ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల !!!
అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలి      .
జూలై 1 నుంచి రైల్వేలో కొత్త నియమాలు..
మా ఎస్వీసీ బ్యానర్ లో "సంక్రాంతికి వస్తున్నాం" తర్వాత "తమ్ముడు" మరో సూపర్ హిట్ ఇవ్వబోతోంది -
యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా "లోపలికి రా చెప్తా" సినిమా ఫోర్త్ సింగిల్ 'టిక్ టాక్ చేద్దామా..' రిలీజ్