మున్సిపల్ పరిధిలోని న్యాయ సమస్యలు త్వరితరగతిన పరిష్కరించాలి...
By Ram Reddy
On
-టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన...
లోకల్ గైడ్ మున్సిపల్ పరిధిలోని న్యాయ సమస్యలు త్వరితరగతిన పరిష్కరించాలి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. నిజామాబాద్ జిల్లా కోర్టు లో న్యాయవాదిగా కొనసాగుతున్న ముత్యాల శ్యామ్ బాబు మున్సిపల్ కార్పోరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ గా నియమితులైన సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్,రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సభ్యులు డాక్టర్ జి.వి. రామకృష్ణ ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని న్యాయపరమైన సమస్యలను, న్యాయపర మైన చిక్కులను తొలగించేందుకు కృషి చేయాలని సూచించారు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు.
Tags:
About The Author
Latest News
01 Jul 2025 15:36:07
ప్రాణం కాపాడే పోరాట యోధులను సన్మానించుకోవడం గొప్పవరం... మెడికవర్ హాస్పిటల్స్