యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా "లోపలికి రా చెప్తా" సినిమా ఫోర్త్ సింగిల్ 'టిక్ టాక్ చేద్దామా..' రిలీజ్
By Ram Reddy
On
లోకల్ గైడ్
టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే "లోపలికి రా చెప్తా" సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ కంపోజ్ చేసిన పాటలన్నీ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. రీసెంట్ గా ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన "లోపలికి రా చెప్తా" ట్రైలర్ ను ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. హారర్ కామెడీ జానర్ లో ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 5న థియేటర్స్ లోకి గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న "లోపలికి రా చెప్తా" సినిమా విజయంపై మూవీ టీమ్ పూర్తి నమ్మకంతో ఉన్నారు.
Tags: